ఇక ఆఫ్ లైన్లో సర్వదర్శనం టోకెన్లు... ఏర్పాట్లు చేసిన టీటీడీ

  • కరోనా సంక్షోభంతో గతంలో నిలిపివేత
  • ఆన్ లైన్ లో టోకెన్ల జారీ
  • తగ్గుతున్న కరోనా వ్యాప్తి
  • ఆఫ్ లైన్ విధానం పునరుద్ధరణ
కరోనా సంక్షోభం ప్రారంభం అయ్యాక శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు ఆన్ లైన్లో మంజూరు చేసిన టీటీడీ... ప్రస్తుతం కరోనా పరిస్థితులు సద్దుమణుగుతుండడంతో మళ్లీ ఆఫ్ లైన్లో సర్వదర్శనం టోకెన్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 15 నుంచి తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీ గోవిందరాజస్వామి సత్రం, శ్రీనివాసం కాంప్లెక్స్ లలో భక్తుల కోసం సర్వదర్శనం టోకెన్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 9 గంటల నుంచి నిర్దేశించిన కౌంటర్ల ద్వారా సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ అధికారులు వెల్లడించారు.

Sarva Darshanam
Tokens
Offline
TTD
Tirupati
Tirumala

More Telugu News